HYD: ముషీరాబాద్‌లోని ఇందిరా పార్కులో అంజన్ కుమార్ యాదవ్ సదర్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సాంప్రదాయ ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, సమగ్రతను పెంపొందిస్తాయన్నారు.