MNCL: దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు బలమైన వ్యవసాయ చట్టాలు కావాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. ఆదివారం జన్నారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయ రంగ విస్తీర్ణం రోజురోజుకూ తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ఆయన కోరారు.