టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరంతో దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన మూవీ ‘K-RAMP’. ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది. దీని డిజిటల్ రైట్స్‌ను ‘ఆహా’ సొంతం చేసుకుంది. థియేటర్ రన్ పూర్తయిన తర్వాత ఇది OTTలోకి రానుంది. ఇక ఈ సినిమాలో యుక్తి తరేజా, సాయి కుమార్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.