KMM: వైరా మండలం గరికపాడులో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ఆవరణ ప్రస్తుతం గేదెలకు కొట్టాలుగా మారాయని ఆదివారం స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. గేదెలను కట్టేస్తున్న యజమానులను గ్రామ కార్యదర్శి ఎన్నిసార్లు హెచ్చరించిన తీరు మారడం లేదన్నారు. అధికారులు తక్షణమే స్పందించి పూర్తి నిర్మాణం చేపట్టాలని, అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని తెలిపారు.