RR: హయత్ నగర్ డివిజన్లోని పద్మావతి కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజ్ ట్రంక్ లైన్ మ్యాన్ హోల్ మరమ్మతు పనులను కార్పోరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా మ్యాన్ హోల్ మరమ్మతులను పూర్తి చేయాలని సంబంధిత జలమండలి మేనేజర్ రాజుకి తెలిపారు. కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.