NLR: చేనేతలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం 100 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. దీంతో చేనేతలు కరెంట్ బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ జీవో విడుదలైంది కానీ అది ఇంతవరకు ఆచరణలోకి రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.