మరోసారి యుద్ధానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, హిజ్బుల్లాతో పూర్తి స్థాయిలో యుద్ధం చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు కొంతకాలంగా ఉన్న ఆయుధాల కొరత తీరడంతోనే యుద్ధానికి దిగుతున్నట్లు నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఈ వార్ కోసం అధునాతన సాంకేతికతో కూడిన ఆయుధాలను ఉపయోగించనున్నట్లు చెప్పారు.