ప్రేమ పేరుతో వంచించి ఇద్దరు బాలికలను అత్యాచారానికి పాల్పడిన యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కన్యాకుమారికి చెందిన 17 ఏళ్ల బాలికను ఆ యువకుడు ప్రేమ పేరుతో తీసుకుపోయి లోబరుచుకున్నాడు. అనంతరం ఆ బాలిక తీసుకువచ్చిన బంగారం, నగదుతో ఉడాయించాడు. మైనర్ ఫిర్యాదుతో పోలీసులు విచారించగా.. కేరళలో ఇదే తరహాలో మరో బాలికను మోసం చేస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు.