చైనాపై ఆధిపత్యం పొందాలంటే భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిందేనని అమెరికా వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు సూచించింది. ఇందుకోసం భారత్తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని బిల్లులో కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వెంటనే ఇరు దేశాల విదేశాంగశాఖ మంత్రులు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.