సత్యసాయి: విజయనగర రాజుల రెండవ రాజధాని పెనుకొండ. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయి. పర్యాటక ప్రియులకు స్వర్గధామంగా నిలుస్తోంది. కొండమీద శ్రీఘనగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు 8 కి.మీ మేరకు ఘాట్రోడ్డులో తిరుపతి మలుపులను తలపించేలా రెండు వరుసల రహదారిని నిర్మించారు. ఈ రోడ్డు వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.