KRNL: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 24న నిర్వహించనున్నట్లు సీఈవో జీ. నాసర రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, అనుబంధశాఖలు, నీటి యాజమాన్య సంస్థ, మత్స్యశాఖ, దేవాదాయశాఖలను అజెండాలో చేర్చారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన ఆయా శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరవ్వాలని కోరారు.