NZB: ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో శనివారం నిర్వహించిన బంద్ నిజామాబాద్ జిల్లాలో విజయవంతమైందని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. ఈ బందు సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, సేవా సంస్థలకు ఆదివారం ఆయన ధన్యవాదాలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని సుధాకర్ స్పష్టం చేశారు.