ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రేటు 2 శాతానికి తక్కువగా, జీడీపీ వృద్ధి 7 శాతానికి పైగా ఉందన్నారు. అలాగే, ఉగ్రదాడులపై ఇక భారత్ మౌనంగా ఉండదని మోదీ స్పష్టం చేశారు. గగనతల, సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ద్వారా దీటుగా బదులిచ్చిందని తెలిపారు. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నా భారత్‌ను ఆపలేరని చెప్పారు.