SKLM: పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా గత పాలనలో ప్రజలకు ఆదుకోవడం జరిగిందని మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిరుపేదలను అన్ని విధాల అన్యాయం చేస్తున్నారని ఇది ప్రజలు గమనిస్తున్నారని వివరించారు.