GNTR: ఫిరంగిపురం మండలంలోని వేమవరం గ్రామం నుండి ఫిరంగిపురం వైపు వచ్చే రోడ్డులో ఉన్న అండర్పాస్ బ్రిడ్జ్ క్రింద వర్షం వచ్చినప్పుడల్లా వర్షపునీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, ప్రయాణం చేయడం కష్టంగా మారింది. రైల్వే అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.