TG: మహాత్మా గాంధీని బ్రిటిషర్లు ఏమీ చేయలేకపోయారని సీఎం రేవంత్ అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తిని స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలల్లోనే మతతత్వ వాదులు పొట్టనపెట్టుకున్నారని గుర్తుచేశారు. గాంధీని హత్య చేసిన వారు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.