ADB: బహిరంగ ప్రదేశంలో జూదం ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ SI బి. సునిల్ కుమార్ తెలిపారు. SI వివరాల ప్రకారం..ఆదిలాబాద్ పట్టణంలోని ఎరోడ్రాం సమీపంలోని అమన్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆడుతున్న జూదగాళ్ల నుంచి రూ.23,400 నగదు, ఎనిమిది సేల్ ఫోన్లు, ఏడు బైక్ లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.