MDK: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్సై మహాదేవాలయంలో యూత్ సండే వేడుకలు ప్రెస్ బీటర్ ఇన్ ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత దేవుడిని అనుసరించి, ఆధ్యాత్మికతతో ముందుకు సాగాలని సూచించారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఏసయ్యను దర్శించుకున్నారు.