భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. దీంతో మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. 2 గంటలకు మ్యాచ్ పునఃప్రారంభం కానుంది. భారత్ స్కోర్ 16.4 ఓవర్లలో 52/4గా ఉంది. రాహుల్(3*), అక్షర్ పటేల్(14*) క్రీజులో ఉన్నారు. శ్రేయస్ 11, గిల్ 10, రోహిత్ శర్మ 8, కోహ్లీ 0 పరుగులు చేశారు.