MBNR: నవాబుపేట మండలం కూచూరు గ్రామంలోని కుర్వగేరిలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే వాడకు చెందిన బుయ్యని పద్మమ్మ (70) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, గొర్రెల కాపరి గంజికుంట చిన్న మల్లయ్య (55) గొర్రెలకు కాపలాకు వెళ్లి పాము కాటుకు గురై శనివారం మరణించాడు. ఈ ఇద్దరి మృతితో ఆ వాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి.