WNP: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సాధనకై జిల్లా కేంద్రంలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.