KMM: కూసుమంచి ZPHSలో 2000 నుంచి 2005 వరకు విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న వీరు తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం తాజా పరిస్థితులను సభా వేదికగా పంచుకున్నారు.