JN: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) 100 సంవత్సరలు పూర్తి చేసుకున్న సందర్బంగా స్టేషన్ ఘనుపూర్లో పద సంచలాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. 200 మందికి పై చిలుకు స్వయం సేవక్‌లు గణవేష్ ధరించి సంచలాన్ చేశారు. స్థానిక బస్టాండ్ నుంచి తిరుమలనాధ స్వామి దేవాలయం వరకు పద సంచలాన్ చేసుకుంటూ.. ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యతను వివరించారు.