VZM: రెవెన్యూ సేవలో ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించవద్దని విజయనగరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీలాగాంధీ అన్నారు. ఆదివారం గజపతినగరం మండలంలోని కొత్తబగ్గాం గ్రామంలో గ్రామ అభివృద్ధి ప్రణాళిక పై సభ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులకు ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.