W.G: నెల్లూరు ఘటనకు కుల రంగు పులిమి వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆదివారం పాలకొల్లులో ఆయన మాట్లాడారు. ఈ ఘటనకు కుల రంగు పులిమి, అక్కడ శవ రాజకీయాలు సృష్టించి ఆ మంటల్లో చలికాచుకోవాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. అవి ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత గొడవలు అని తెలిపారు.