BDK: భద్రాచలంలో కొలువైన భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యి స్వామివారి కళ్యాణం తిలకించారు. స్వామి కళ్యాణం అనంతరం మూలవిరాట్ను దర్శించుకొని, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. భక్తులు అధికంగా తరలివచ్చారని వారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో దామోదర్ తెలిపారు.