AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు. పరిశ్రమలకు పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయాలని నిర్ణయించారు. తొలి విడతలో రూ.1,500 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాయితీలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతోనే రాయితీలు చెల్లిస్తున్నామన్నారు.