NLG: దీపావళి పండుగ సందర్భంగా BRS పార్టీ మిర్యాలగూడ పట్టణ అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ దంపతులు, పట్టంలోని బాపూజీ నగర్ 7, 21 వ వార్డు మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు ఆదివారం అందజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన వస్త్రాలు అందజేసినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.