SKLM: స్థానిక కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం, క్యాన్సర్ పరీక్షలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. వైద్యులు క్యాన్సర్ సహా పలు వ్యాధులపై పరీక్షలు నిర్వహించారు.