PPM: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాణసంచా సామాగ్రి పేలుడు ఘటనా స్థలాన్ని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పరిశీలించారు. దర్యాప్తు చేసి, బస్సులలో పార్సిల్ సర్వీసు ద్వారా నిషేధిత మందుగుండు సామాగ్రి బుక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం క్షతగాత్రులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.