KMR: పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పేకాట ఆడినందుకు ఇప్పటికే 39 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. పేకాట దాడుల్లో జిల్లాలో రూ.79,390 నగదు, 29 సెల్ఫోన్లు, 9 బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.