ప్రకాశం: కొండపి పంచాయతీలోని దాసరెడ్డిపాలెం ఎస్సీ కాలనీలో 20 రోజులుగా మంచినీరు రాక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామస్తులు గత 20 రోజులుగా సుదూర ప్రాంతాల నుంచి బోరు నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. బోరు నీళ్లలో ఫ్లోరిన్ అధికంగా ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.