కృష్ణా: ఘట్టమనేని కృష్ణ సోదరుడు, ప్రముఖ సినీ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు దివిసీమ పర్యటనకు వచ్చారు. వారికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మండలి కుటుంబంతో తమకున్న అనుబంధం స్మరించుకున్నారు.