TPT: సూళ్లూరుపేట(M) కోటపోలూరు రోడ్డు పెద్దపెద్ద గుంతలతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంతల్లో చేరిందన్నారు. దీని వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, నరకానికి నకళ్లుగా కోటపోలూరు రహదారి మారిపోయిందని ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. నాయకులు ఈ సమస్యపై దృష్టి సారించాలని వారు కోరారు.