TPT: తడ పోలీస్స్టేషన్ పరిధిలో నాయుడుపేట DSP చెంచుబాబు ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. గుమ్మడిపూడి కాలనీ పరిసర ప్రాంతంలో కలియతిరిగి సరైన పత్రాలు లేని పది వాహనాలను స్టేషన్కు తరలించారు. అనుమానాస్పద వ్యక్తులు కానీ వాహనాలు గాని గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, తడ, సూళ్లూరుపేట ఎస్సైలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.