ELR: ఎంపీ పుట్టా మహేష్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండగ దీపావళి అని, దుష్టశక్తులపై దైవశక్తి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అన్నారు.