ATP: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు రూ. 31 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు 595 మందికి రూ. 5.50 కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరైనట్లు పేర్కొన్నారు. అలాగే, ఇంకా 273 ఫైల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.