కృష్ణా: గుడివాడలోని 3వ వార్డు 4వ లైన్లో ఆదివారం రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజలు రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో సహకరించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ వార్డు టీడీపీ ఇంఛార్జ్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఈ రోడ్డు పనులు పూర్తయ్యాక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.