KMM: కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామా శ్రీను మాతృమూర్తి రామా కళావతి దశ దిన కర్మ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. కాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. కళావతి చిత్రపటానికి పూలమాలవేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రితోపాటు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.