SRD: గడ్డపోతారం మున్సిపాలిటీ చౌదరిగూడెంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుడు పాండురంగ లింగం చెరువులో ఈతకు వెళ్లి మునిగి మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఆయన ఈత కొడుతూ రెండుసార్లు పైకి తేలి మూడోసారి మునిగిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఎస్ డిఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహం వెలికి తీశారు.