VZM: కొత్తవలస మండలం చీడివలస గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పీడీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వరి, అపరాల పంటలపై సస్యరక్షణపై ఆదివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయ ఆవశ్యకతను వివరిస్తూ రసాయన ఎరువులను తగ్గించి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు.