HNK: దీపావళి పండుగను పురస్కరించుకుని మల్లికాంబ మనోవికాస కేంద్రం చిన్నారులు ఆదివారం హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయానికి వచ్చి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యని కలిశారు. ఈ సందర్భంగా చిన్నారులు స్వయంగా తయారుచేసిన దీపాలను అందజేసి ఎంపీకి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం, అభ్యాసం గురించి ఆరా తీశారు.