AP: కల్తీ మద్యం కేసు బయటపెట్టినందుకే తనపై కుట్ర చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనార్దన్ రావు వీడియోను ఎవరు లీక్ చేశారో ఎవరూ చెప్పడం లేదని మండిపడ్డారు. ఏ విచారణను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఏదో రకంగా తనపై కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.