ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దన్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబర్లతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.