TG: ధరణి అనే చట్టం కొంతమంది దొరలకు చుట్టంగా మారింది అని CM రేవంత్ ఆరోపించారు. ‘ఈ ధరణి ఓ MROను పెట్రోల్ పోసి తగలబెట్టింది. ధరణి దరిద్రం.. ఓ జంట ఆత్మహత్యకు కారణమైంది. ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని భూమిపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి, బంగాళాఖాతంలో విసిరారు. కానీ, వాళ్ల ఓటమి కారణం ఈ ధరణిని పెంచిపోషించడమే అని వారికి తెలియదు’ అని అన్నారు.