ELR: ఉపాధి హామీ పనిదినాలు పెంపు, నిధులు పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం గణపవరం మండల మహాసభ పెచ్చేటి ఓంకారమ్మా అధ్యక్షతన ఆదివారం కేశవరంలో సమావేశం జరిగింది. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పెచ్చేటి నరసింహమూర్తి పాల్గొన్నారు.