TG: మీరు తప్పు చేస్తే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే అవకాశం ఉందని నూతన సర్వేయర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘భవిష్యత్లో భూ యజమానుల హక్కులను, సరిహద్దులను నిర్ణయించే అధికారం మీ చేతుల్లో ప్రభుత్వం ఉంచింది. కన్నతల్లి మీద ఎవరైనా ఆధిపత్యం చేయాలనే చూస్తే.. సామాన్యుడు కూడా తిరగబడ్డ చరిత్ర మనది. కాబట్టి ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది’ అని అన్నారు.