CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు సినీ హీరో గల్లా అశోక్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సూపరిండెంట్ వాసు, ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మణి నాయుడు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.