MBNR: సమాజ సేవలో భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సీనియర్ సిటిజన్లను కోరారు. రూ.10 లక్షల మున్సిపల్ నిధులతో సీనియర్ సిటిజన్ ఫోరం సమావేశ మందిరం నిర్మించారు. ఆదివారం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సీనియర్ సిటిజెన్లు సమాజానికి దీపం లాంటి వారని, అభ్యున్నతికి పాటుపడిన మహా శక్తులు అని ఎమ్మెల్యే అన్నారు.