NGKL: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని కోరుతూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ బీసీసబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు రాజేందర్, జేఏసీ నాయకులు సదానందం గౌడ్, న్యాయవాది అమరేందర్, కానుగుల జంగయ్య తదితరులు పాల్గొని నినాదాలు చేశారు.